ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసానికి తరలి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్

  • ఢిల్లీలో కేసీఆర్ పర్యటన
  • కేజ్రీవాల్ తో భేటీ
  • దేశ రాజకీయాలపై చర్చ
  • అనేక అంశాల ప్రస్తావన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ ను శాలువా కప్పి సన్మానించారు. ఆయనకు ఓ వీణ బొమ్మను జ్ఞాపికను బహూకరించారు. అనంతరం ఇరువురు సమావేశపై పలు అంశాలను చర్చించారు.

ప్రస్తుత జాతీయ రాజకీయాలు, రాజ్యాంగపరమైన అంశాలు, దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇతర అంశాలపై సమాలోచనలు చేశారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, వెంకటేశ్ నేతా, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు ఉన్నారు.
.

Nationalist Voice

About Author

error: Content is protected !!