టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి షార్జా విమాన సర్వీసును ప్రారంభించిన వైసీపీ ఎంపీ బాలశౌరి

  • సోమ, శనివారాల్లో నడవనున్న విజయవాడ, షార్జా విమాన సర్వీసు
  • 55 మంది ప్రయాణీకులతో విజయవాడ చేరిన ఎయిరిండియా విమానం
  • 125 మంది ప్రయాణీకులతో తిరిగి షార్జాకు వెళ్లిన విమానం
విజయవాడ నుంచి నేరుగా షార్జాకు విమాన సర్వీసు సోమవారం ప్రారంభమైంది. ఈ సర్వీసును గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి… టీడీపీ ఎంపీ కేశినేని నానితో కలిసి ప్రారభించారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీలు షార్జా విమానం ఎక్కిన ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేశారు. విజయవాడ నుంచి నేరుగా షార్జాకు విమానం నడిపనున్నట్లు ఇటీవలే ఎయిరిండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వారంలో రెండు రోజుల పాటు నడవనున్న విజయవాడ షార్జా విమానం… ముందుగా షార్జా నుంచి విజయవాడ చేరుకుని ఆ వెంటనే తిరిగి షార్జా బయలుదేరుతుంది. సోమ, శనివారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇందులో భాగంగా సర్వీసు ప్రారంభమైన సోమవారం 55 మంది ప్రయాణికులతో షార్జా నుంచి గన్నవరం చేరిన ఎయిరిండియా విమానం…125 మంది ప్రయాణికులతో తిరిగి షార్జాకు తిరుగు ప్రయాణమైంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!