టీటీడీ కీలక నిర్ణయం.. కొత్త సాఫ్ట్‌వేర్, డిస్కౌంట్ రేట్లు

నేషనలిస్ట్ వాయిస్, మే 19, తిరుమల  :  టీటీడీ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన‌ కొత్త సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ రూపొందించాల‌ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్‌లో అగరబత్తీలు, పంచగవ్య ఉత్ప‌త్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో త‌యారు చేసిన ఫోటో ఫ్రేమ్ లతో పాటు టీటీడీ ఉత్పత్తుల విక్రయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఉత్పత్తులన్నింటికి సంబంధించిన ఖర్చు విశ్లేషణ నివేదిక (కాస్ట్ ఎనాలిసిస్) రిపోర్టులను ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని టీటీడీ ఫైనాన్స్ విభాగం అధికారులను ఈవో ఆదేశించారు. త‌ద్వారా ఏ ఉత్పత్తులు వేగంగా అమ్ముడవుతున్నాయో తెలుసుకోవ‌డానికి సహాయపడుతుంద‌ని, దాని ద్వారా ఇత‌ర ఉత్పత్తులపై ప్రజల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టగలం అని అన్నారు. అత్యధికంగా అమ్ముడవుతున్న ఉత్పత్తులకు డిస్కౌంట్ రేట్ల‌ను ప్ర‌వేశ పెట్టాలని ఈవో సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. తిరుమలలోని అన్ని విక్రయ కౌంటర్లలో ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలని, యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉండే లడ్డూ కౌంటర్ సమీపంలో ప్రత్యేకంగా ఉత్పత్తుల కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీల విక్రయాల మాదిరిగానే ఈ ఉత్పత్తులన్నీ పోస్టల్ శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ఈవో ఆదేశించారు. దీని వల్ల యాత్రికులు తిరుపతి లేదా తిరుమలకు రాలేకపోయినా ఆన్‌లైన్‌లో వస్తువులు మరియు ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుందన్నారు. టీటీడీకి చెందిన అన్ని ఉత్పత్తుల విక్రయాలపై ఈవో సుదీర్ఘంగా చర్చించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!