జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం.. స‌మ‌స్య‌ల‌తో పోటెత్తిన జ‌నం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం జ‌న‌వాణి పేరిట కొత్త కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య భ‌వ‌న్‌లో ఆదివారం ఉద‌యం ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ దృష్టికి తీసుకువ‌చ్చేందుకు భారీ సంఖ్య‌లో జ‌నం వ‌చ్చారు. విన‌తుల‌తో త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన జ‌నం స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ స్వీక‌రిస్తున్నారు. వాటిపై అక్క‌డిక‌క్క‌డే ప‌రిష్కార మార్గాలు ల‌భించేలా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేస్తున్నారు.
జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని ఆదివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. దాదాపుగా 5 గంట‌ల పాటు సాగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో జ‌నం స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్ స్పందించ‌నున్నారు. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై అధికార యంత్రాంగంతో పాటు వైసీపీ ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌ల‌తో పాటు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌నున్నారు.
https://twitter.com/JanaSenaParty/status/1543459317231153153?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1543459317231153153%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-747592%2Fpawan-kalyan-starts-janavaani-in-vijayawada
Nationalist Voice

About Author

error: Content is protected !!