జగ్గారెడ్డి వ్యాఖ్యలపై హైకమాండ్ తో చర్చించాం: మల్లు భట్టి విక్రమార్క

తమ పార్టీ అంతర్గత వ్యవహారాలపై కేసీ వేణుగోపాల్ తో చర్చించినట్టు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగిందని చెప్పారు. ఇప్పుడు అంతా సర్దుకుందని అన్నారు.
హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా… బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న దోస్తీ బయట పడిందని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకోలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!