జగిత్యాల అభివృద్ధి కి ఎల్లప్పుడూ కృషి చేస్తా… ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్

 

నేషనలిస్ట్ వాయిస్, మే 19, జగిత్యాల రూరల్ : పేద ప్రజల సంక్షేమమే ప్రధాన ఆశయంగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామాలకు చెందిన లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 58 మంది లబ్దిదారులకు రూ.18,00,000/- లక్షల చెక్కులను గురువారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా జడ్పీచైర్పర్సన్ దవా వసంత్ సురేష్ స్థానిక నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్బంగా  జిల్లా జడ్పీ చైర్పర్సన్ దవా వసంత మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదన్నారు.తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు.  అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..  తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నా.. జగిత్యాల నియోజకవవర్గమే నా..  కులం, మతమని, జగిత్యాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.  కొందరు ప్రతిపక్ష నాయకులు పని కట్టుకొని అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వేలాది కుటుంబాలను సీఎం సహాయ నిధి ద్వారా అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి , మండల రైతు బంధు కన్వీనర్ నక్క రవీందర్ రెడ్డి, రూరల్ మండలం యుత్ అధ్యక్షులు దమ్మ సురేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!