జగన్ రెడ్డి దొంగ బ్రతుకు మరోసారి బయటపడింది: నారా లోకేశ్

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. 12 డైరెక్టర్ పదవులకు గాను 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో, వైసీపీ నేతలు దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూనే ఉందని అన్నారు. తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో జగన్ రెడ్డి దొంగ బతుకు మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతో గెలవడం కూడా ఒక గెలుపేనా? ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులను గృహ నిర్భంధం చేసే హక్కు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. 

దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని టీడీపీ నేతలు పట్టుకుంటే… వారిని వదిలేసి టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని లోకేశ్ మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలిస్తే దొంగే అంటారే తప్ప నాయకుడు అనరని చెప్పారు. ఎన్నికల్లో దగ్గరుండి ఓట్లు వేయిస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన టీడీపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!