“చెల్లెమ్మా పురందేశ్వరీ”… అంటూ మరోసారి టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి

  • పురందేశ్వరిపై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్న విజయసాయి
  • మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనేంటి అంటూ పురందేశ్వరిపై ఫైర్
  • భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ ట్వీట్
Vijayasai Reddy targets Purandeswari again

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై వైసీపీ ప్రభుత్వంపై తన విమర్శల దాడిని కొనసాగిస్తుండగా, వైసీపీ నేతలు ఆమెను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీకి కేంద్రం ఎన్నో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఆశించిన స్థాయిలో పనులు జరగడంలేదని విమర్శించారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో స్పందించారు. చెల్లెమ్మా పురందేశ్వరీ… జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని, మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? అంటూ నిలదీశారు. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!