చెత్త కుప్పలు తప్పితే ఢిల్లీకి బీజేపీ ఇచ్చిందేమీ లేదు: కేజ్రీవాల్

  • యూపీలోని ఘాజీపూర్ లో డంప్ యార్డ్ ను పరిశీలించిన ఢిల్లీ సీఎం
  • ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం 15 ఏళ్లుగా బీజేపీ చేతిలోనే ఉందన్న కేజ్రీవాల్
  • ఇన్నేళ్లలో ఢిల్లీ మొత్తాన్ని బీజేపీ చెత్త కుప్పగా మార్చిందని విమర్శ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ లోని డంప్ యార్డ్ ను పరిశీలించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలందరూ ఆప్‌లో చేరే రోజు వస్తుందని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ పాలనపై కూడా ఆయన విమర్శలు చేశారు. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ పీఠంపై కూర్చున్న బీజేపీ ఢిల్లీని చెత్త కుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

తాను ఘాజీపూర్ లో చెత్త కుప్పలను చూడటానికి వచ్చానని తెలిపారు. పెద్ద పెద్ద చెత్త కుప్పలు తప్పితే ఢిల్లీకి బీజేపీ ఏం ఇచ్చిందో ఆ పార్టీ కార్యకర్తలంతా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక్కసారి మీ పార్టీని మరిచిపోయి దేశం కోసం ఓటు వేయండి’ అని కోరారు. ఏదో ఒకరోజు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా బీజేపీ చెత్త పార్టీ అని, ఆప్ మంచి పార్టీ అని చెబుతారని వ్యాఖ్యానించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!