‘చీకోటి’ ల్యాప్‌టాప్‌లో ఏముంది?.. ఈడీ ముందుకు ప్రవీణ్‌

హైదరాబాద్‌: క్యాసినో, హవాలా వ్యవహారాలకు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను ఈడీ విచారణ చేస్తోంది. సోమవారం ఉదయం ఈడీ కార్యాలయానికి చేరుకున్న చికోటి.. తన వెంట బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, నోటీస్‌ కాపీతో పాటు న్యాయవాదిని తీసుకొచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.

చీకోటి ప్రవీణ్‌ హవాలా దేవీలపై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. చికోటి వాట్సాప్‌ కీలక సమాచారాన్ని ఈడీ సేకరించింది. చీకోటి ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ను అధికారులు సీజ్‌ చేశారు. పెద్ద మొత్తంలో హవాలా జరిగినట్లు ఈడీ గుర్తించింది. సినీ, రాజకీయ నేతలకు చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. 10 మంది సినీ ప్రముఖులతో పాటు 20 మంది రాజకీయ నేతలు, 200 మంది కస్టమర్స్‌ లిస్ట్‌ ముందుంచి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఫ్లైట్‌, హోటల్స్‌ బుకింగ్‌పై కూడా ఈడీ కీలక సమాచారం సేకరించింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!