చిరూ వ్యక్తిత్వంలోను మెగాస్టారే: మెహర్ రమేశ్

  • మెహర్ రమేశ్ దర్శకుడిగా ‘భోళా శంకర్’
  • చిరంజీవికి ఇది మరో మాస్ యాక్షన్ మూవీ
  • అజిత్ ‘వేదాళం’ సినిమాకి రీమేక్
  • మెగాస్టార్ చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
  • ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల
చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ ‘భోళాశంకర్’ సినిమాను రూపొందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా, 2015లో తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’ మూవీకి రీమేక్. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

తాజా ఇంటర్వ్యూలో మెహర్ రమేశ్ మాట్లాడుతూ .. ” మొదటి నుంచి కూడా నేను చిరంజీవిగారి అభిమానినే. ఆయన సినిమాలను తప్పకుండా చూసేవాడిని. నా దృష్టిలో ఆయన సూపర్ హీరో. అలాంటి నాకు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అభిమానిగా మెగాస్టార్ ను ఎలా చూడాలనుకుంటానో, అలాగే ఆయనను తెరపై చూపించడానికి ట్రై చేస్తున్నాను” అన్నారు.

“చిరంజీవిగారికి సహనం ఎక్కువ. ఏ విషయంలోను ఆయన తొందరపడి మాట్లాడరు. తనని తాను మలచుకుంటూ ఎదిగినవారాయన. నటన విషయంలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఆయన మెగాస్టారే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నింగిలోని సూర్యుడు .. నేలపై హిమాలయం’ అంటూ చెప్పుకొచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!