చిన్నారిని బలితీసుకున్న చైన్‌ స్నాచర్‌..

జనగామ జిల్లా: జనగామ జిల్లా అంబేడ్కర్‌ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 10 నెలల చిన్నారి ప్రాణాలను ఓ చైన్‌ స్నాచర్‌ బలి తీసుకున్నాడు. చిన్నారిని ఎత్తుకొని రోడ్డుమీద వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాగేందుకు బైక్‌పై వచ్చిన చైన్‌ స్నాచర్‌ ప్రయత్నించాడు. అయితే దుండగుడిని మహిళ అడ్డుకోవడంతో చైన్‌ తెగి ఆమె చేతిలోనే పడింది. దీంతో మహిళ చేతిలోని చిన్నారిని లాక్కొని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి పరారయ్యాడు దొంగ.

నీటిలో పడిన ఏడాది చిన్నారి ఊపిరాడక ప్రాణాలు విడిచింది. మృతిచెందిన చిన్నారిని నడిగోటి భాస్కర్‌, ప్రసన్నల  పాపగా గుర్తించారు. అయితే ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో మహిళ ఒక్కతే ఇంటి వద్ద ఉంది. భార్యభర్తల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నాయా? చిన్నారి మృతికి అవేమైనా కారణమయ్యాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే చైన్‌ స్నాచర్‌ ఈ ఘాతుకానికి పాల్పడింది నిజమేనా? అని తెలుసుకునేందుకు సీసీటీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు. 

Nationalist Voice

About Author

error: Content is protected !!