చిట్టెలుక మోడ‌లింగ్‌..ఫొటోల‌కు ఫోజులు!!

సాధార‌ణంగా పెంపుడు కుక్క‌లు, పిల్లులు ఫొటోల‌కు ఫోజులిస్తుంటాయి. కానీ, మీరెప్పుడైనా అడ‌వి జంతువులు ఫొటోలు దిగ‌డం చూశారా..? ఓ అడ‌వి చిట్టెలుక పూలు ప‌ట్టుకొని హొయ‌లుపోయింది. ఓ చిట్టి మోడ‌ల్ అయిపోయింది. జూలియ‌న్ రాడ్ అనే వైల్డ్ ఫొటోగ్రాఫ‌ర్ తీసిన ఈ చిట్టెలుక మోడ‌లింగ్ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను ‘బ్యూటెంగేబిడెన్’ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ‘మీరెప్పుడైనా అడివి చిట్టెలుక ఫొటోషూట్ చేయ‌డం చూశారా?’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ వీడియోలో బొరియ‌లోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ అడ‌వి చిట్టెలుక‌కు ఫొటోగ్రాఫ‌ర్ కొన్ని పూలు అందించాడు. అది వాటిని ప‌ట్టుకొని తింటున్న‌ది. అనంత‌రం వాటితో ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ వీడియో 5మిలియ‌న్ల వీక్ష‌ణ‌ల‌ను సొంతం చేసుకున్న‌ది. దాదాపు 2 ల‌క్ష‌ల‌మంది లైక్ చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!