ఘనంగా షిరిడి సాయిబాబా పౌర్ణమి పల్లకి సేవ…

నేషనలిస్ట్ వాయిస్, మే 16, జగిత్యాల  : పౌర్ణమి పర్వదినమును పురస్కరించుకున జగిత్యాలలోని స్థానిక కృష్ణా నగర్ లోని షిరిడి సాయిబాబా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం బాబాకు హారతులు భక్తులు విశేషముగా అందజేయగా..  వేదపండితుల వేదపటనముతో,  భక్తుల భజనల మద్య సాయిబాబా పల్లకిసేవ ఘనంగా నిర్వహించారు. పల్లకిలో సాయి ఉత్సవ మూర్తిని కొలువు దీర్చి ఆలయము చుట్టూ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం భక్తులకు విశేష అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, సాయి భక్తులు, ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, గొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎలుగందుల సత్యనారాయణ, మార  కైలాసం, ఆయిల్నేని రాం కిషన్ రావు, కళాశ్రీ గుండేటి రాజు, పూజారులు వేణుమాధవ చార్య, రాజేశ్వర శర్మ, మేనేజర్ పంజాల తిరుపతి గౌడ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!