గులాబీ ద‌ళం బ‌లం, ధ‌న‌మెంతో చెప్పిన కేసీఆర్‌

K R gives slogan of golden Bharat

K R gives slogan of golden Bharat

తెలంగాణ‌లో అధికార పార్టీగా కొన‌సాగుతున్న టీఆర్ఎస్ ఏ పాటి బ‌ల‌మైన‌ద‌న్న విష‌యంపై ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ పార్లీ ప్లీన‌రీ వేదికగా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. పార్టీకి నిబ‌ద్ధ‌త క‌లిగిన 60 ల‌క్ష‌ల మంది స‌భ్యులున్నారన్న కేసీఆర్‌.. తాము ఒక్క పిలుపు ఇస్తే… రూ.600 కోట్ల విరాళాలు వ‌స్తాయని చెప్పారు. 2024 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్సే గెలుస్తుంద‌ని వ్యాఖ్యానించిన కేసీఆర్‌.. ఇప్ప‌టిదాకా జ‌రిగిన స‌ర్వేల్లో పార్టీకి 90కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని తెలుస్తోందని వెల్ల‌డించారు.

అనంత‌రం పార్టీ ద‌గ్గ‌ర ఉన్న నిధులు, ఆస్తుల విలువ‌ల‌ను కూడా కేసీఆర్ బయటపెట్టారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడుతూ.. “మ‌న ద‌గ్గ‌ర నిధులు పుష్క‌లంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ఖాతాలో రూ.865 కోట్ల నిధులున్నాయి. వెయ్యి కోట్ల అసెట్స్ క‌లిగిన పార్టీ టీఆర్ఎస్‌. పార్టీకి రెండు ఇన్నోవాలు, ఒక ఫోర్డు కారు ఉంది” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!