గురుకులాల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనలిస్ట్ వాయిస్, మే 19, హైదరాబాద్ :  గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 6, 7, 8వ తరగులు మరియు ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు సూచించారు.  దరఖాస్తుల ప్రక్రియ మొత్తం ఆన్ లైన్ లోనే చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  http://mjptbcwreis.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి అంటే 2022 – 23 విద్యాసంవత్సరానికి జూనియర్ కాలేజీలో, డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే  040-23322377, 23328266 ఫోన్ నెంబర్లకు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన సూచించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!