గుడివాడ సమీపంలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడ్డ 60 మంది!

  • గుడివాడ నుంచి విజయవాడకు వెళ్తున్న సమయంలో ప్రమాదం
  • ఇంజిన్ నుంచి వచ్చిన మంటలతో బస్సు దగ్ధం
  • డ్రైవర్ హెచ్చరికతో బస్సు నుంచి దిగి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు కాలిబూడిదయింది. గుడివాడ నుంచి విజయవాడకు వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సును నిలిపేసి.. అందరూ దిగిపోవాలంటూ హెచ్చరించారు. ఆ సమయంలో బస్సులు 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. డ్రైవర్ హెచ్చరికతో అందరూ హుటాహుటిన దిగిపోయారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం సంభవించలేదు.

మరోవైపు, ప్రాణభయంతో కంగారుగా బస్సు దిగే క్రమంలో తమ వస్తువులను చాలా మంది బస్సులోనే వదిలేశారు. ఇవన్నీ కూడా బస్సుతో పాటే దగ్ధమయ్యాయి. బ్యాగుల్లో ఉంచిన డబ్బు, బంగారం, ఇతర వస్తువులు కాలిపోయాయని కొందరు ప్రయాణికులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!