గుంటూరు కోర్టుకు హాజరైన రాయపాటి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ

  • 2010లో రాయపాటిపై పరువు నష్టం దావా వేసిన కన్నా లక్ష్మీనారాయణ
  • ఈ కేసు విచారణ కోసమే గుంటూరు కోర్టుకు వచ్చిన నేతలు
  • కేసు విచారణను పూర్తి చేసినట్టు ప్రకటించిన కోర్టు
కోస్తాంధ్రకు చెందిన ఇద్దరు రాజకీయ ఉద్ధండులు మంగళవారం ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు… బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణలు మంగళవారం గుంటూరులోని స్థానిక కోర్టుకు హాజరయ్యారు. 2010లో దాఖలైన ఓ పరువు నష్టం కేసు విచారణ నిమిత్తం వీరిద్దరూ ఒకేసారి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణను పూర్తి చేసినట్లుగా మంగళవారం కోర్టు ప్రకటించింది. తీర్పును రిజర్వ్ చేసింది.

2010లో రాయపాటిపై కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆ సమయంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం గమనార్హం. నాడు రాయపాటి గుంటూరు లోక్ సభ సభ్యుడిగా కొనసాగుతుండగా… కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి అదికారంలోకి రాగా… వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రిగా కొనసాగారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కొణిజేటి రోశయ్య, కల్లారి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో కన్నా మంత్రిగా కొనసాగారు. ఈ క్రమంలోనే స్థానిక రాజకీయాల నేపథ్యంలోనే ఆయన రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!