గడప గడపకూ షీ టీమ్స్‌

  • ‘సెక్స్‌ టార్చర్‌’ పై రాచకొండ షీ టీమ్స్‌ స్పెషల్‌ ఆపరేషన్‌
  • హయత్‌నగర్‌లోని ఓ కళాశాల ప్రిన్సిపాల్‌పై కొత్తగా మూడు కేసులు..
  • పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం

హైదరాబాద్‌ మహా నగరంలో ప్రలోభాలు, అధికార హోదాలో లైంగిక దాడికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు రాచకొండ షీ టీమ్స్‌ ప్రత్యేక అపరేషన్లను నిర్వహిస్తున్నది. బాధితులకు అండగా ఉంటూ కలవరపడుతున్న వారి మనస్సుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నది. అదే విధంగా బాధితుల ఇంటికి పోలీసులు వచ్చారనే విషయాన్ని తెలియకుండా ఉండేందుకు షీ టీమ్స్‌ చాలా జాగ్రత్తలను తీసుకుంటూ రంగంలోకి దిగుతుంది. బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారు చెబుతున్నది నిజమా? కాదా? వాటికి సంబంధించిన ఆధారాలను ప్రాథమికంగా సేకరిస్తున్నారు. బాధితులకు ఒక హోమ్లీ వాతావరణాన్ని కల్పించి వారిలో పోలీసు పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నారు. వారికి జరిగిన అన్యాయంపై ఓదార్పును వ్యక్తం చేస్తూ న్యాయ పోరాటానికి బాధితులను సిద్ధం చేస్తున్నారు.

ప్రిన్సిపాల్‌ పనులపై మరో మూడు ఫిర్యాదులు..
తాజాగా హయత్‌నగర్‌ ప్రాంతంలో ఓ ప్రైవేటు కళా శాల ప్రిన్సిపాల్‌ వ్యవహారం విద్యార్థినుల్లో కలవరం రేపింది. బాధితురాలిగా మారిన ఓ విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ఈ వ్యవహరంపై ఆరా తీసి షీ టీమ్స్‌ డీసీపీ సలీమా నేతృత్వంలోని ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి అస లు ఆ కాలేజీల్లో ఏం జరుగుతోంది? ఎలా జరుగుతున్నది? బాధితులు ఎందుకు భయపడతున్నారు? అంశాలపై దర్యాప్తు చేయించారు. దీంతో షీ టీమ్స్‌ మఫ్టీలో కళాశాల దగ్గర తిరగడంతో ఆనేక ఆసక్తికరమైన అంశా లు వెలుగులోకి వచ్చాయి.

ప్రాక్టికల్స్‌లో ఫుల్‌ మార్కులు వేస్తాడని…
మైనర్‌ విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ సెలవు సమయంలో టార్గెట్‌ చేస్తాడు. వారితో సన్నిహితంగా మాట్లాడి వారికి ప్రాక్టికల్స్‌ పరీక్షల్లో ఫుల్‌ మార్క్స్‌ వేస్తానని చెప్పి మభ్యపెడతాడు. ఆ మార్క్స్‌ ఇవ్వడం తన చేతుల్లోనే ఉంటుందని ప్రలోభ పెట్టడం, ఇలా కొంత మందిని ఎంచుకుని వారిని కాలేజీ పనికి తీసుకువెళ్తున్నట్లు చెప్పి సినిమాలకు, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. అక్కడ వారితో అసభ్యంగా ప్రవర్తించి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని బెదిరించడం లాంటివి జరుగుతున్నట్టు సమాచారం. ఇలా విద్యార్థినులు ఈ అవమాన భారాన్ని గుండెలో నింపుకుని మధనపడుతున్నట్టు తెలిసింది.

ఎవరీకి భయపడాల్సిన అవసరం లేదు
అధికార హోదా, అంగ బలం, రాజకీయ అండదండల ప్రలోభాలతో విద్యార్థినులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్పడినా తమకు న్యాయం జరగదనే భయం బాధితులు వీడాలి. ఆ అపోహ నుంచి బయటపడాలి. మీకు అండగా మేముంటాం. షీ టీమ్స్‌ మీకు రక్షణగా ఉంటాయి. ఎవర్నీ వదిలిపెట్టం. చట్టపరంగా కఠినంగా ఉంటాం. ఫిర్యాదుకు సంబంధించి పక్క ఆధారాలు సేకరిస్తాం. నిందితులకు శిక్షలు పడేలా చేస్తాం. ధైర్యంగా ముందుకు రావాలి. ఈ కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారిస్తాం. తరచుగా మహిళలను మోసం, లైంగిక దాడి, లైంగిక దాడికి యత్నాలు, అభ్యంతకరమైన ప్రవర్తనతో ఇబ్బంది పెట్టే కేసులలో పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్‌ను విధిస్తాం.
– మహేష్‌ భగవత్‌, పోలీసు కమిషనర్‌, రాచకొండ

మనో వేదన అవసరం లేదు…
సున్నితమైన కేసులలో బాధితుల ఇంటికే వెళ్తున్నాం. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాం. రాచకొండ పరిధిలో దాదాపు 10కి పైగా ఇలాంటి ఘటనలలో బాధితుల ఇంటికి వెళ్ళాం. వారు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఫిర్యాదులు తీసుకుని కేసులను నమోదు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుపై క్షు ణ్ణంగా దర్యా ప్తు చేసి ప్రాథమిక ఆధారాలను సే కరించి నిందితు ల భరతం పడుతున్నాం. ఎవ ర్నీ వదిలిపెట్టం. షీ టీమ్స్‌పై ఎవ రీ ఒత్తిళ్లు ఉండ వు. బాధితులు ఎవరైనా లైంగిక దాడులు, యత్నాలు, అసభ్యకరమైన ప్రవర్తనలకు గురైనప్పుడు డయల్‌ 100 లేదా రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో బాధితు లు ఉంటే వాట్సాప్‌ నం:94906 17111లో సంప్రదించాలి.
– సలీమా, డీసీపీ, రాచకొండ షీ టీమ్స్‌

Nationalist Voice

About Author

error: Content is protected !!