గజ్వేల్ జర్నలిస్టు హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గం ఎన్నిక

నేషనలిస్ట్ వాయిస్, మే 16, గజ్వేల్:  గజ్వేల్ జర్నలిస్టు హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  జర్నలిస్టు హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా గజ్వేల్ కు చెందిన జి. నవీన్ కుమార్, మహిపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కాలనీ అభివృద్ధికి తోడ్పడుతామని, అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా బాలరాజు, మీర్జా అహ్మద్ బేగ్ (బాబా), గౌరవ అధ్యక్షులుగా మీర్జా హబీబ్ బేగ్, కోశాధికారి వెంకటాచారి,  సెక్రెటరీ శివ దాస్,  ముఖ్య సలహాదారులు ఎన్. రాజు ఆర్గనైజింగ్ సెక్రెటరీ జహంగీర్,  ప్రచార కార్యదర్శి రమేష్ లు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మధుసూదన్ రావు, సాయిబాబా, బాకీ నర్సింలు,  వీరభద్రయ్య, బలరాం, మల్లేశం, యాదగిరి, దోమ నర్సింలు, నరేష్, కృష్ణ, స్వామి, నరసింహారెడ్డి, కనకరాజు, శివకుమార్, శ్రీనివాస్, రాజు, స్వామి, వెంకటేష్, నారాయణరెడ్డి నరసింహులు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!