కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జ్వరం… నిలిచిన ప్రచారం

  • మునుగోడులో ప్రచార హోరు
  • అనారోగ్యంపాలైన రాజగోపాల్ రెడ్డి
  • తన ప్రచారాన్ని రద్దు చేసుకున్న వైనం
  • ప్రచారం కొనసాగించాల్సిందిగా ఇతర బీజేపీ నేతలకు సూచన
మునుగోడు ఉప ఎన్నికల్లో నేడు బీజేపీ ప్రచారం కళ తప్పింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జ్వరంతో బాధపడుతుండడమే అందుకు కారణం. నవంబరు 3న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్నిరోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలయ్యారు.

జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండడంతో నేడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. దాంతో నియోజకవర్గంలో తన ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ఇతర బీజేపీ నేతలు మునుగోడులో తమ ప్రచారాన్ని కొనసాగించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.

వాస్తవానికి ఆయన ఇవాళ నియోజకవర్గంలోని నాంపల్లిలో ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. జ్వరం నుంచి కోలుకున్న వెంటనే ఆయన ప్రచారంలోకి అడుగుపెడతారని తెలుస్తోంది.

కాగా, ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 31న బీజేపీ భారీ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది

Nationalist Voice

About Author

error: Content is protected !!