కోమటిరెడ్డిపై చెప్పుతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్త

  • మనుగోడులో ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్న ప్రచారం
  • పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని వాహనాన్ని ధ్వంసం చేసిన బీజేపీ శ్రేణులు
  • ఆందోళనకు దిగిన పాల్వాయి స్రవంతి
మునుగోడు ఉపఎన్నిక ప్రచారపర్వం ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. పార్టీల మాటల యుద్ధమే కాకుండా… భౌతిక దాడులు కూడా చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని ఒక వాహనాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో, ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ శ్రేణులు ఈ పనికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఈ దాడిపై ఆమె ఆందోళనకు కూడా దిగారు. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపింది. ఈ క్రమంలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆయనపై చెప్పుతో దాడి చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Nationalist Voice

About Author

error: Content is protected !!