కోమటిరెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో 18 థౌజెండ్ వాలా పేల్చిన యువకులు

  • బీజేపీతో రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులు కోమటిరెడ్డి తీసుకున్నాడంటూ ఆరోపణలు
  • చౌటుప్పల్ లో 18 థౌంజండ్ వాలా పేల్చిన యువకులు
  • కోమటిరెడ్డికి బుద్ధి చెపుతామని నినాదాలు
మునుగోడు ఉప ఎన్నికలో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. విపక్షాలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిరసిస్తూ కొందరు యువకులు 18 థౌంజండ్ వాలా టపాసులను పేల్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను తీసుకుని ఆయన బీజేపీలో చేరారంటూ టీఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ కు చెందిన కొందరు యువకులు టపాసులు పేల్చారు. మనుగోడు ఆత్మగౌరవాన్ని కోమటిరెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో కోమటిరెడ్డికి తగిన బుద్ధి చెపుతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!