కొత్త మండ‌లాల ఏర్పాటుపై ఎమ్మెల్సీ క‌విత హ‌ర్షం

హైద‌రాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేయ‌డంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత హ‌ర్షం వ్య‌క్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ‌లాలు ఏర్పాటుకు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. డొంగేశ్వ‌ర్, ఆలూరు, సాలూర కేంద్రంగా కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త‌మ ప్ర‌తిపాద‌నను ఆమోదించినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ క‌విత జిల్లా ప్ర‌జ‌ల త‌ర‌పున ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త‌గా 13 మండలాల‌ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

Nationalist Voice

About Author

error: Content is protected !!