“కేసినో” కింగ్‌లపై ఈడీ ఎటాక్స్ !

తెలుగు రాష్ట్రాల్లో కేసినో కింగ్‌లుగా పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే వ్యక్తులకు చెందిన ఇళ్లు, ఆఫీసులపై ఈడీ ఎటాక్స్ జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుట్టుగా కేసినోలు నిర్వహించి వందల కోట్లు రాబట్టడం వీరి స్టైల్. స్టార్ హోటళ్లలో నడిచిపోయే ఈ క్యాసినోలు కొన్నాళ్ల కిందట ఏపీలోని గుడివాడలో బహిరంగంగా నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్‌లో కేసినో జరిగినట్లుగా ఆధారాలు లభించినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత మరోసారి ఓ స్టార్ హోటల్లో కేసినో ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో బయటకు తెలియడంతో అనుమతుల్ని పోలీసులు రద్దు చేశారు. అయిేత తెలియకుండా చాలా చోట్ల కేసినోల్ని నిర్వహిస్తున్నారని.. ఈడీ అధికారులకు సమాచారం అందింది. ఇండియాలో అయితే పట్టుకుంటున్నారని ప్రత్యేక విమానాల్లో జూదరుల్ని నేపాల్ తీసుకెళ్లి అక్కడ కాసినో ఆడిస్తున్నారని సమాచారం అందింది. ఇటీవల ఈ కేసినో వ్యవహారంలో వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరిపై ఈదీ దృష్టి పడినట్లుగా తెలుస్తోంది. ఈ కేసినో లావాదేవీలన్నీ బయటకు వస్తే.. రాజకీయ నాయకుల బండారం కూడా బయటపడుతుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఫెమా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈడీ ఈ అంశంపై పైపై సోదాలకే పరిమితం అవుతుందా లేకపోతే.. అంతర్గతంగా విచారణ జరిపి.. అసలు సూత్రధారుల్ని … పాత్ర ధారుల్ని కూడా బయటకు లాగుతుందా అనేది తేలాల్సి ఉంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!