కేంద్రమంత్రిపై ట్విట్టస్త్రాలు సంధించిన కేటీఆర్‌

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రో ధరల పెంపుపైన చేసిన ట్వీట్లపైన మంత్రి కేటీఆర్ స్పందించి ట్విట్టస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్ ఉత్పత్తుల పైన తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పన్ను పెంచలేదని కేటీఆర్‌ ఓట్వీట్‌ చేయగా.. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదని కేటీఆర్‌ అన్నారు. అంతేకాకుండా మరోవైపు 2014లో క్రూడాయిల్ ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ రేటు 70 రూపాయలు ఉంటే… ఇప్పుడు కూడా అదే ధరకి క్రూడ్ ఆయిల్ దొరుకుతున్నప్పుడు 120 రూపాయలకు పైగా పెట్రోల్ పెరిగిన అంశంపైన సమాధానం చెప్పాలన్నారు.

ఈ పెరుగుదల కి కారణం కేంద్రంలో ఉన్న నాన్ పర్ఫార్మెన్స్ అస్సెట్ (NPA) గవర్నమెంట్ అయిన మీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్ డ్యూటీలు, సేస్సులు కారణం కాదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే మీరు కేంద్రం పెంచిన సేస్సులని పూర్తిగా రద్దు చేస్తే 70 రూపాయలకు, 60 రూపాయలకు డీజిల్ భారతదేశ ప్రజలకు అందించే వీలుంది… ఈ విషయాన్ని మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చెబితే మంచిది.. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా 26 లక్షల కోట్ల రూపాయల సేస్సుల రూపంలో ప్రజల నుంచి గుంజినది వాస్తవం కాదా… అని ఆయన ట్వీట్‌ చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!