కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంపై పవన్ కల్యాణ్ స్పందన

  • పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు
  • కేంద్రం నిర్ణయంతో తగ్గిన పెట్రో ధరలు
  • సామాన్యుడికి ఎంతో ఊరట అన్న పవన్
  • ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని విజ్ఞప్తి
పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం చేసిన ప్రకటనపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడికి ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ఇంతటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, వర్షాకాలం రాకముందే రోడ్లకు మరమ్మతులు చేయించాలని కోరారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!