కుర్ర హీరోయిన్లతో సందడి చేస్తున్న రవితేజ!

  • వరుస సినిమాలను లైన్లో పెట్టిన రవితేజ
  • విడుదలకి రెడీ అవుతున్న ‘ధమాకా’
  • వచ్చే ఏడాదిలోను మూడు సినిమాల విడుదల
  • కథానాయికలుగా యంగ్ బ్యూటీస్ సందడి
సీనియర్ హీరోల సరసన సీనియర్ హీరోయిన్స్ దొరకడం కష్టమైపోతున్న ఈ ట్రెండులో, రవితేజ కుర్ర హీరోయిన్లతో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం ఆశ్చర్యం. రవితేజ సినిమాలకి హీరోయిన్ కోసం వెతుక్కోవలసిన అవసరం లేదు. ఆయన జోడీ కట్టడానికి కుర్ర హీరోయిన్స్ సైతం ఆసక్తినీ .. ఉత్సాహాన్ని చూపుతుండటం విశేషం. అందువల్లనే హీరోయిన్స్ వైపు నుంచి కూడా ఆలస్యం అనేది లేకుండా ఆయన సినిమాలు సెట్స్ పైకి వెళుతున్నాయి.

‘నేల టిక్కెట్టు’ సినిమా నుంచి రవితేజ యంగ్ బ్యూటీలతో జోడీకట్టడం ఎక్కువవుతూ వచ్చింది. ఆ సినిమాలో ఆయన సరసన మాళవిక శర్మ సందడి చేసింది. ఆ తరువాత ‘డిస్కోరాజా’ సినిమాలో నభా నటేశ్ .. ‘ఖిలాడీ’లో మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి ఆయన సరసన ఆడిపాడారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’లో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్  ఆయన జోడీ కట్టింది. ఇక త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ధమాకా’ సినిమాలోనూ ఆయనతో కలిసి శ్రీలీల అలరించనుంది.

ఇక ‘రావణాసుర’ .. ‘టైగర్ నాగేశ్వరరావు’ లైన్లో ఉండగానే, రవితేజ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశారు. ఎడిటర్ గా .. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరున్న కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమా పరమేశ్వరన్ .. కావ్య థాపర్ కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా రవితేజ జోరు ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషమే.

Nationalist Voice

About Author

error: Content is protected !!