కుర్ర కమెడియన్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన టాలీవుడ్ నటి

  • టాలీవుడ్ లో యువ నటుల మధ్య వార్
  • ఇటీవల అవార్డు అందుకున్న కల్పిక గణేశ్
  • అభినవ్ గోమటం తనను ఐటెం అన్నాడని కల్పిక ఆరోపణ
  • క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • కల్పిక తనను కావాలనే టార్గెట్ చేసిందన్న అభినవ్
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో సమంతకు అక్కగా నటించిన కల్పిక గణేశ్ టాలీవుడ్ యువ కమెడియన్ అభినవ్ గోమటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కల్పిక గణేశ్ ఓ కార్యక్రమంలో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది.

అయితే, అభినవ్ గోమటం తనను ఐటెం అంటూ అవమానకరంగా వ్యాఖ్యానించాడని కల్పిక మండిపడుతోంది. అంతేకాదు, అభినవ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ, అభినవ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది.

అటు, అభినవ్ గోమటం మాత్రం సారీ చెప్పేందుకు ససేమిరా అంటున్నాడు. కల్పిక ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నాడు.

Nationalist Voice

About Author

error: Content is protected !!