కుమార్తె క్లాసికల్ డ్యాన్స్ వీడియోతో దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు

  • నేడు దీపావళి
  • దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం
  • సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన మహేశ్ బాబు
  • సితార వీడియోకు అభిమానుల నుంచి విశేష స్పందన
ఇవాళ దీపావళి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. తన కుమార్తె సితార క్లాసికల్ డ్యాన్స్ వీడియోను ట్వీట్ చేసి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం ప్రేమ, వెలుగులు, సంతోషంతో ఎల్లప్పుడూ కళకళలాడాలని ఆకాంక్షించారు.

కాగా, మహేశ్ బాబు పంచుకున్న వీడియోలో సితార ఓ నాట్య కళాకారిణితో కలిసి అమ్మవారి స్తోత్ర గీతానికి అనుగుణంగా నర్తించడం చూడొచ్చు. మహేశ్ బాబు పోస్టు చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. కొద్దిసమయంలోనే వేల లైకులు, రీట్వీట్లు సొంతం చేసుకుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!