కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య.

కుటుంబ కలహాలతో ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని నాగసాని పల్లి గ్రామ శివారులో గ్రామ శివారు ఆదివారం చోటు చేసుకుంది ఎస్ఐ విజయ్ కుమార్ కథనం మేరకు మండలంలోని నాగసాన్పల్లి గ్రామం చెందిన తలారి కృష్ణయ్య( 52) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు గత కొన్ని రోజుల్లో విషయంలో నష్టం రావడంతో సంసారo విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి గత మూడు రోజులుగా ఇంటికి రాకుండా ఆయన వ్యవసాయ పొలం వద్దే ఉంటున్నాడు ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం వ్యవసాయ పొలం వద్ద ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అటుగా వెళ్ళిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు పంచనామా నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు మృతుడికి ఇరువురు కుమారులు ఒక కుమార్తె భార్య లక్ష్మి ప్రస్తుతం నా గు సాని పల్లి ఎంపీటీసీ సభ్యురాలుగా కొనసాగుతుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!