‘కాళి’ సినిమాలో సిగరెట్ తాగుతున్నట్టుగా అమ్మవారి పోస్టర్.. దర్శకురాలిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్ల డిమాండ్

కాళికాదేవిని అమానించేలా ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్‌పై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పోస్టర్‌లో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టు ఉండడం తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతున్న ఈ పోస్టర్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాళికాదేవిని అవమానించిన ఆ డైరెక్టర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసిన డైరెక్టర్‌ను వదలొద్దంటూ ట్విట్టర్‌ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. #ArrestLeenaManimekalai హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.A
డైరెక్టర్ లీనా మణిమేకలై ఈ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాళీమాత వేషధారణలో ఉన్న ఓ మహిళ సిగరెట్ తాగుతున్నట్టుగా అందులో ఉంది. ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో కొడవలితో ఉన్న ఆ మహిళ మరో చేతితో ఎల్‌జీబీటీక్యూ ప్లస్ (LGBTQ )కు చెందిన జెండాను పట్టుకుని ఉండడం గమనార్హం. ఆమె ఆ పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే లీనాపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. సినిమాను లాంచ్ చేసిన ఆగా ఖాన్ మ్యూజియం వెంటనే దానిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా, పీఎంవో వెంటనే జోక్యం చేసుకుని లీనాపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!