కార్తి హీరోగా .. కమల్ నిర్మాతగా లోకేశ్ కనగరాజ్ మూవీ!

  • ‘సర్దార్’తో హిట్ కొట్టిన కార్తి
  • ‘ఖైదీ’ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
  • ఈ లోగానే లోకేశ్ కనగరాజ్ తో చేసే ఛాన్స్
  • మరోసారి కమల్ బ్యానర్లో లోకేశ్
కార్తి కెరియర్లో చెప్పుకోదగిన సినిమా ‘ఖైదీ’. సినిమా అంతా కార్తి ఒక లుంగీ .. ఒక చొక్కాతోనే కనిపిస్తాడు. అలా ఒక హీరో ఒకే డ్రెస్ తో కనిపించిన ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘ఖైదీ’ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సమయం కోసమే అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

అయితే ‘ఖైదీ’ సీక్వెల్ సంగతి అటుంచితే, ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనేది కోలీవుడ్ టాక్. ఈ సినిమాకి నిర్మాత కమల్ హాసన్ కావడం విశేషం. ఆయన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. తనకి ‘విక్రమ్’ సినిమాతో హిట్ ఇచ్చిన దగ్గర నుంచి లోకేశ్ కనగరాజ్ పై కమల్ కి మరింత నమ్మకం ఏర్పడింది. అందువలన ఈ ప్రాజెక్టు సెట్ అయినట్టుగా సమాచారం.

ఇక లోకేశ్ కనగరాజ్ విషయానికొస్తే విజయ్ కి ‘మాస్టర్’ హిట్ ఇచ్చిన ఆయన, మరోసారి విజయ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన ‘ఖైదీ 2’ చేస్తాడా? ‘విక్రమ్ 2’ చేస్తాడా? లేదంటే కమల్ బ్యానర్లో కార్తి హీరోగా సినిమా చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు.

Nationalist Voice

About Author

error: Content is protected !!