కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరించిన కేసులో వైఎస్ కొండారెడ్డికి బెయిల్ మంజూరు

  • రెండు రోజుల క్రితం కొండారెడ్డి అరెస్ట్‌
  • బెయిల్ మంజూరు చేసిన ల‌క్కిరెడ్డిప‌ల్లి కోర్టు
  • రాయ‌చోటి జైలు నుంచి విడుద‌లైన కొండారెడ్డి
కాంట్రాక్ట‌ర్ల‌ను వ‌సూళ్ల కోసం బెదిరించిన కేసులో అరెస్టయిన కేసులో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీప బంధువు, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చ‌క్రాయ‌పేట‌ వైసీపీ ఇంచార్జీ వైఎస్ కొండారెడ్డికి బెయిల్ మంజూరైంది. రెండు రోజుల క్రితం అరెస్టయిన కొండారెడ్డి క‌డ‌ప జిల్లాలోని ల‌క్కిరెడ్డిప‌ల్లి కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ చేప‌ట్టిన కోర్టు… ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధ‌వారం సాయంత్ర‌మే రాయ‌చోటి జైలు నుంచి కొండారెడ్డి విడుద‌ల‌య్యారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!