కర్ణాటక లింగాయత్ పీఠాధిపతి ఆత్మహత్య వెనుక ఒక మహిళ హనీట్రాప్!

  • మహిళతో ప్రైవేట్ మూమెంట్స్ ను రికార్డ్ చేసిన మరో మహిళ
  • దీని వెనుక హనీట్రాప్ ఉందన్న పోలీసులు
  • సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
కర్ణాటకలో 45 ఏళ్ల లింగాయత్ పీఠాధిపతి గత సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది. దీని వెనుక హానీట్రాప్ ఉందని పోలీసులు వెల్లడించారు. ఒక మహిళ తన వీడియో కాల్స్ తో ఆయనను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పారు. ఒక మహిళతో పీఠాధిపతి ప్రైవేట్ మూమెంట్స్ ను మరో మహిళ తన ఫోన్ లో రికార్డ్ చేసిందని తెలిపారు. ఇదే విషయాన్ని సదరు పీఠాధిపతి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారని చెప్పారు. ఒక గుర్తు తెలియని మహిళ ఈ దారుణాన్ని చేసిందని సూసైడ్ నోట్ లో తెలిపారు. దీని వెనుక హనీట్రాప్ ఉందని అన్నారు.

కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కంచుగల్ బండే మఠంలో తన ప్రార్థనా గదిలో పీఠాధిపతి బసవలింగ స్వామి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతి స్థానం నుంచి తొలగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని సూసైడ్ లో ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసులు వెల్లడించారు. నాలుగు అసభ్యకర వీడియోలను రిలీజ్ చేయడం ద్వారా ఒక మహిళతో పాటు మరి కొందరు ఆయనను వేధించారని తెలిపారు. ఆ వ్యక్తులకు సంబంధించిన వివరాలు తమకు తెలుసని చెప్పారు.

ఆయన ఆత్మహత్య వెనుక మఠంలోని, మఠం వెలుపలి రాజకీయాలు కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. కొందరు పీఠాధిపతులకు రాజకీయ నాయకులతో బలమైన పరిచయాలు ఉన్నాయని… వీరు ఇతర పీఠాధిపతులను దెబ్బతీసేలా వ్యవహరిస్తుంటారని చెప్పారు. అయితే ఈయన ఆత్మహత్య వెనుక రాజకీయ కారణాలు మాత్రం లేవని అన్నారు. ఈ ఆత్మహత్యను అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు.

ఈ మఠం 400 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఆత్మహత్యకు పాల్పడిన పీఠాధిపతి 20 ఏళ్ల వయసులోనే మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించారు. 1997లో బాధ్యతలను స్వీకరించిన ఆయన… ఇటీవలే సిల్వర్ జుబ్లీ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!