కబ్జాదారుల కోరల్లో వాక్ బోర్డ్ భూములు.

నేషనలిస్ట్ వాయిస్, మే 19, కామారెడ్డి :  కంచె చేను మేసిన చందంగా మారింది  పిట్లం మండల కేంద్రంలో గల వాక్ బోర్డ్ భూములు గతి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నేషనల్ హైవే కు సమీపంలో గల7 సర్వే నంబర్లలో సుమారుగా 12 ఎకరాల 30గుంటల వరకు వాక్ బోర్డుకు సంబంధించిన భూములు ఉన్నాయి. గతంలో రెవెన్యూ అధికారులు భూములకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్ వాక్ బోర్డ్ సమస్థకు చెందినదిగా వీటిని ఎవరూ కొనుగోలు చేయకూడదని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని అధికారులు సూచికను ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినప్పటికీ కొందరు రాజకీయ నాయకుల తో పొత్తులు ఏర్పాటు చేసుకొని యదేచ్ఛగా నిర్మాణాలు చేపట్టారు. ఇందులో నిర్మించిన వాటికి ఎలాంటి అనుమతులు లేకున్న అధికారులు మాత్రం వాటి నివారించలేక పోయారు. సర్వే నంబర్ 405,690,755,759,788,851,891.లలొ సుమారుగా గా 12 ఎకరాల 30 గుంటలు భూమి ఉన్నది. గ్రామానికి సమీపంలో ఉండడంతో ప్రస్తుత మార్కెట్ ధర ఎకరాకి ఒక కోటి యాభై లక్షల నుండి రెండు కోట్లు ధర పలుకుతుండడంతో కబ్జాదారుల కన్ను వీటి పై పడి రాజకీయ నాయకులతొ కుమ్మక్కై కబ్జాలకు గురిచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేద మైనారిటీల కోసంఏర్పాటుచేసిన వాక్ బోర్డ్ సమస్థ భూములను అర్హులైన వారికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!