కట్టెల కోసం అడవికి వెళ్తే.. ఏకంగా వజ్రమే దొరికింది..!

ఆమెది నిరుపేద కుటుంబం. అడవిలో దొరికే కట్టెలే వారికి జీవనాధారం. అడవిలో సేకరించిన కలపను మార్కెట్లో అమ్మితే.. ఏవైనా డబ్బులు వస్తే.. వాటితోనే బతుకుతారు. ఐతే ఆ మహిళ ఎప్పటిలాగే కట్టెల కోసం అడవికి వెళ్లింది. పన్నాలోని పురుషోత్తంపూర్ వార్డు నెంబర్ 27లో గెండా బాయి అనే మహిళ నివసిస్తోంది. ఆమెకు . ఆయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త చిన్న చిన్న కూలీ పనులు చేస్తుంటాడు. కానీ వారి కుటుంబానికి ఏ మాత్రం సరిపోవు. అందుకే గెండా బాయి కూడా అడవిలో కలప సేకరిస్తూ డబ్బులు సంపాదిస్తుంది. ఆమె ప్రతిరోజూ పన్నా జైలు వెనక ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి కలప సేకరిస్తుంది.

అడవిలోకి వెళ్లి కట్టెలు సేకరిస్తుండగా.. నేలపై ధగ ధగా మెరుస్తూ ఓ రాయి కనిపించింది. వెంటనే దానిని ఇంటికి తీసుకెళ్లి.. భర్తకు చూపించింది. ఆ రాయి ఏంటో భర్తకు కూడా అర్థం కాలేదు. కానీ బాగా మెరుస్తూ ఉండడంతో.. వజ్రం కావచ్చని అనుమానం వచ్చింది. మరుసటి రోజు స్థానికంగా ఉండే ఓ జ్యెవెలరీ దుకాణానికి వెళ్లారు. అక్కడ వజ్రాల వ్యాపారి అనుపమ్ సింగ్‌కు ఆ రాయిని చూపించారు. దానిని పరిశీలించిన అనుపమ్ సింగ్..అది సాధారణమైన రాయి కాదని.. వజ్రమని చెప్పాడు.అది వజ్రమని చెప్పడంతో… గెండా బాయి దంపతుల ఆనంధానికి అవధుల్లేవు. ఎంతో సంతోషపడ్డారు. ఇది కలా? నిజామా అని ఆశ్చర్యపోయారు. అడవిలో దొరికిన ఆ వజ్రం బరువు 4 క్యారెట్ల 39 సెంట్లు ఉంది.

బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షల వరకు పలుకుతుంది. ఐతే దానిని ఎంతో కొంత రేటుకు విక్రయించకుండా.. వేలంలో పెట్టాలని బంధువులు సూచించారు. ఇందుకోసం వజ్రాలను వేలం వేసే ఓ ఆఫీసు సంప్రదించారు. తదుపరి వేలంలో దీనిని ఉంచుతామని నిర్వాహకులు  చెప్పారు. దానికి భారీ రేటు రావచ్చనే అంచనాలున్నాయి. వజ్రం డబ్బుతో పిల్లలకు పెళ్లిళ్లు చేస్తామని గెండా బాయి దంపతులు చెప్పారు. మిగిలిన డబ్బులను ఇంటి నిర్మాణానికి వినియోగిస్తామని తెలిపారు. కాగా, ఏపీలోని అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాకాలంలో పంట పొలాల్లో ఇలాంటి వజ్రాలు దొరుకుతుంటాయి. వజ్రకరూరు ప్రాంతాల్లో ఎంతో మంది వీటి కోసం అన్వేషిస్తారు. ఐతే ఎవరికో ఒకరికి మాత్రమే విలువైన వజ్రాలు దొరుకుతుంటాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!