కంటి ఆపరేషన్ పూర్తయ్యాక చిరునవ్వులు చిందిస్తూ చంద్రబాబు..

  • టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్
  • హైదరాబాదు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో క్యాటరాక్ట్ సర్జరీ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫొటో
Chandrababu smiles after eye surgery

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇవాళ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. నేడు రెండో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!