ఓటు వేయ‌క‌పోతే వేటు వేయ‌డం వైసీపీ న‌యా ఫ్యాక్ష‌న్ డెమోక్ర‌సీ: నారా లోకేశ్

ఓటు వేయని వారిపై వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తమ అభ్యర్థుల ఏకగ్రీవానికి ఒప్పుకోకపోతే వైసీపీ దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ లు, హత్యలు చేయడం వంటివాటిని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చూశామని చెప్పారు. టీడీపీ అభ్యర్థికి ఓటేసి తన ఓటమికి కారణమయ్యాడనే కక్షతో వారి ఇంటిని వైసీపీ నేత పోలయ్య కబ్జా చేశాడని మండిపడ్డారు.అధికారం అండతో పోలయ్య ఇంటిని ఆక్రమించడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని అన్నారు. ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు జగన్ రెడ్డిగారూ అని ప్రశ్నించారు. ప్రజలు తిరగబడక ముందే కబ్జాలు, అరాచకాలు మానండని ట్విట్టర్ వేదికగా సూచించారు. దీంతోపాటు ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు. 

Nationalist Voice

About Author

error: Content is protected !!