ఓటమి భయంతోనే చంద్రబాబు పై తప్పుడు కేసులు: దేవినేని ఉమా

  • జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్న ఉమా
  • ఎన్నికలు అయ్యేంత వరకు బాబును జైల్లోనే ఉంచాలనుకుంటున్నారని మండిపాటు
  • అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని వ్యాఖ్య
False cases against Chandrababu because of fear of defeat says Devineni Uma

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఫ్యాక్షన్ వాతావరణంలో పెరిగిన జగన్ అండతో వైసీపీ శ్రేణులు పేట్రేగి పోతున్నాయని, బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాయని అన్నారు. టీడీపీ కార్యకర్తలపై 60 వేల అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. మీ తప్పుడు కేసులు, అరెస్టులకు టీడీపీ నేతలు భయపడబోరని అన్నారు. మీ అరాచకాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!