ఒక్క విజయంతో వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్​ను అధిగమించిన భారత్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తన ర్యాంక్ ను మెరుగు పరుచుకుంది. తాజాగా విడుదలైన టీమ్ ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు 105 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు 108 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. 106 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ నాలుగో ర్యాంకుకు పడిపోయింది.
126 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, 122 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 101 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానం సాధించింది. దక్షిణాఫ్రికా (99 పాయింట్లు), బంగ్లాదేశ్ (96), శ్రీలంక (92), వెస్టిండీస్ (71), అఫ్గానిస్థాన్ (69) వరుసగా ఆరు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.
కాగా, మంగళవారం జరిగిన మ్యాచ్లో జస్ ప్రీత్ బుమ్రా (6/19) దెబ్బకు ఇంగ్లండ్ 110 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం రోహిత్ శర్మ (76*) మరియు శిఖర్ ధావన్ (31*) అజేయంగా 114 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
Nationalist Voice

About Author

error: Content is protected !!