ఏయే హీరోయిన్ కి చికోటి ప్రవీణ్ ఎంత ఇచ్చాడో తెలుసా?

సుమారు రెండు మూడు రోజుల నుంచి హైదరాబాదుకు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ కుమార్ వ్యవహారం సంచలనంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి ప్రవీణ్ చికోటి సహా అతని అనుచరులు మాధవరెడ్డి అలాగే వారికి సంబంధించిన పలుచోట్ల ఈడీ రైడ్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రైడ్స్ లో అనేక కీలక విషయాలను కూడా రాబట్టారు.

వీళ్ళందరూ కూడా లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా క్యాసినో  నిర్వహించారని హవాలా లావాదేవీల ద్వారా డబ్బు రాబట్టారని అనేక విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాక అతనికి పలు రాజకీయ నాయకులతో కూడా ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయనే విషయాలు బయటకు వచ్చాయి. అయితే రాజకీయాల వరకే పరిమితం అవుతుందనుకుంటే ఇప్పుడు ఆ ఈ వ్యవహారం సినీ పరిశ్రమ వరకు చేరింది. మే నెలలో చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలో నేపాల్ లో నిర్వహించిన క్యాసినోకి పలువురు సినీ తారలు ప్రమోటర్లుగా వ్యవహరించినట్లు తేలింది.ఈ వ్యవహారంలో ఎవరెవరికి ఎంత ముట్టాయి అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఈ క్యాసినోకి ప్రచారకర్తలుగా ఉన్నందుకు మల్లికా శెరావత్ కి కోటి రూపాయలు, అమీషా పటేల్ 80 లక్షలు, ఈ సారి ఈషా రెబ్బ 40 లక్షలు, డింపుల్ 40 లక్షలు, ముమైత్ ఖాన్ 15 లక్షలు, గోవిందా 50 లక్షలు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా 20 లక్షల దాకా తీసుకున్నట్లయితే చెబుతున్నారు. వీరు కాకుండా ఇంకా చిన్న స్థాయిలో ఉన్న తారలు కూడా ఉన్నారని తెలుస్తోంది.

అయితే చివరికి ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ అందులో ఉన్న సమాచారం మేరకు సినీ, రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. 10 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. తారలతో తయారు చేసిన ప్రోమోలను వాట్సాప్‌లో ప్రముఖులకు పంపిన చికోటి తద్వారా మంచి ప్రమోషన్స్ చేసినట్టు చెబుతున్నారు. 

Nationalist Voice

About Author

error: Content is protected !!