ఏపీ సీఎం జగన్ ను ప్రశంసించిన కేంద్రమంత్రి తోమర్

ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై కేంద్రమంత్రి తోమర్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రకృతి సేద్యం, అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ అంశాల్లో ఏపీ స్ఫూర్తిదాయకంగా చర్యలు తీసుకుంటోందని అభినందించారు. వ్యవసాయ రంగంలో ఏపీ అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ప్రేరణ అని తోమర్ పేర్కొన్నారు. అంతేకాదు, ఇ-క్రాపింగ్ విధానం ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. 

కాగా, ఈ వర్చువల్ సమావేశంలో సీఎం జగన్ తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కూడా పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!