ఏపీ సీఎం జగన్​పై తెలంగాణ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు…

తెలంగాణలోని గోషా మహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బాయ్ కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతుందని రాజాసింగ్​ ధ్వజమెత్తారు. అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. జగన్ తప్పుడు నిర్ణయాలతో హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తుందని ఈ  సందర్భంగా రాజాసింగ్​ విమర్శించారు. తిరుపతిలో శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారిందని అన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయికాట్ తిరుపతి అనేది వైరల్ అవుతుందని చెప్పారు రాజాసింగ్​. జగన్ తప్పుడు నిర్ణయాలే ఈ వివాదానికి కారణమని ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. సీఎం జగన్ ఏ దేవుడిని నమ్ముతాడో దేశ ప్రజలు అందరికి తెలుసుని రాజా సింగ్ అన్నారు.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు, తిరుపతికి జగన్ తీరుతో చెడ్డ పేరు వస్తుందని రాజాసింగ్​ విమర్శించారు. సుప్రీంకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదిని ఉంచడం ద్వారా హిందూ మనోభావాలను నిలబెట్టే చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని రాజాసింగ్​ అన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!