ఏపీలో 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ లీక్!

  • 10th class English question paper leaked in AP
  • శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పేపర్ లీక్
  • పరీక్ష ప్రారంభమైన వెంటనే సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షం
  • తెలుగు, హిందీ పేపర్లు కూడా లీక్ అయిన వైనం
ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుండటం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లీష్ పేపర్ లీకయింది. 
పరీక్షలు ప్రారంభమైన తొలి రోజున తెలుగు పేపర్, రెండో రోజున హిందీ పేపర్ లీక్ అయ్యాయి. అయితే పేపర్ లీక్ కాలేదని అధికారులు చెప్పారు. నంద్యాల జిల్లాలో మాత్రం తెలుగు పేపర్ లీక్ కు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు
Nationalist Voice

About Author

error: Content is protected !!