ఎన్టీఆర్ ప్రాణం తీసిన వాళ్లే దండలేసి దండం పెడుతున్నారు: చంద్రబాబుపై రోజా ఫైర్

“రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు ఓ శని” అని ఎన్టీఆర్ ఏనాడో అన్నారని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గుర్తు చేశారు. ఇవాళ ఉదయం తన నియోజకవర్గ నేతలతో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన చంద్రబాబే.. నేడు ఆయన ఫొటోలకు దండలు వేసి దండం పెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఈ మహానాడులోనైనా ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినా చంద్రబాబుకు కృతజ్ఞత లేదన్నారు. చేసిన తప్పులను మహానాడు ద్వారా సరిదిద్దుకోకుండా.. కేవలం సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రోజా విమర్శించారు. జగన్ మాత్రం పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకూ లబ్ధి కలుగుతోందన్నారు. 
95 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేస్తే.. హామీల మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచే తీసేసిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు.  ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేశ్ లకు పిచ్చెక్కి తిరుగుతున్నారని విమర్శించారు. మంచి చేశాం కాబట్టే జనాల్లోకి వెళుతున్నామన్నారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని విమర్శిస్తున్న టీడీపీ, జనసేనలు.. గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేశాయని ప్రశ్నించారు.మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడం అమానుష చర్య అని మండిపడ్డారు. అల్లర్లను పోలీసులు ఎంతో సమన్వయంతో కట్టడి చేశారన్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!