ఎన్టీఆర్ – కొరటాల సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్!

  • తన 30వ సినిమాను కొరటాలతో చేస్తున్న ఎన్టీఆర్
  • ఆయన బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్ పోస్టర్ వదిలిన కొరటాల
  • ఇది మాస్ యాక్షన్ మూవీ అనే విషయానికి అద్దం పట్టిన పోస్టర్
  • ఈ రోజు రాత్రి 7:02 నిమిషాలకు రానున్న లేటెస్ట్ అప్ డేట్

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ – కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్  పైకి వెళుతుందా .. ఎప్పడు ఎన్టీఆర్ లుక్ బయటికి వస్తుందా .. అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందనే అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అనుకున్నట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను వదిలారు. ఆల్రెడీ శత్రు సంహారం చేసినట్టుగా రక్తం అంటిన వేటకొడవలి పట్టుకున్న ఎన్టీఆర్ చేయి మాత్రమే ఈ పోస్టర్ లో కనిపిస్తోంది.

ఈ పోస్టర్ ను బట్టే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. ఈ రోజు రాత్రి  7:02 నిమిషాలకు మరో అప్ డేట్ ఉంటుందంటూ మరింత ఆసక్తిని పెంచారు. కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా. ‘జనతా గ్యారేజ్’ తరువాత ఎన్టీఆర్ – కొరటాల నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!