ఎనిమిదేళ్లు సీఎంగా ఉండి కేసీఆర్ చేసిందేమీ లేదు: షర్మిల

  • పథకాల పేర్లు చెపుతూ మోసం చేస్తున్నారు
  • ఒక్క పథకాన్ని కూడా అమలు చేయడం లేదు
  • విపక్షాలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమీ లేదని చెప్పారు. పథకాల పేర్లు చెపుతూ మోసం చేయడమే కాని… ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు.

చివరకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికి కూడా కేసీఆర్ కు చేతులు రావడం లేదని అన్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలు కేసీఆర్ కు అమ్ముడు పోయాయని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా ఇష్టానుసారం పాలించారని అన్నారు. తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలనను తీసుకురావడం కోసమే వైఎస్సార్టీపీని స్థాపించామని చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!