ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై తెలంగాణ‌లో పోలీస్ కేసు న‌మోదు

ఏపీలో అధికార పార్టీ వైసీపీ టికెట్‌పై ఎంపీగా గెలిచి ఆ పార్టీకి రెబ‌ల్‌గా మారిపోయిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై తెలంగాణ‌లో పోలీసు కేసు న‌మోదైంది. హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌పై కేసు న‌మోదు అయ్యింది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ర‌ఘురామ‌రాజుపై కేసు న‌మోదు చేసిన‌ట్లు గ‌చ్చిబౌలి పోలీసులు తెలిపారు.
ర‌ఘురామ‌రాజుపై న‌మోదు చేసిన ఈ కేసులో ఆయ‌న కుమారుడు భ‌ర‌త్‌, పీఏ శాస్త్రిల‌తో పాటు సీఆర్‌పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్ల‌నూ నిందితులుగా చేరుస్తూ గ‌చ్చిబౌలి పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అనుమ‌తి లేకుండా త‌న ఇంటి వ‌ద్ద నిఘా పెట్టారంటూ ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ర‌ఘురామ‌రాజు అనుచ‌రులు అదుపులోకి తీసుకున్న వ్య‌వ‌హారంలో ఈ కేసు న‌మోదైంది.
Nationalist Voice

About Author

error: Content is protected !!