ఉత్తర తెలంగాణలో చుక్క నీటికి కష్టాలు

నేషనలిస్ట్ వాయిస్, మే 19, కరీంనగర్ :   ఎండాకాలం వచ్చిందంటే.. చాలు నీటి కష్టాలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నీటి కోసం ప్రజలు పడే అష్టకష్టాలు అంతాఇంత కాదు. నీటి బిందె కోసం కిలోమీటర్ల మేర నడుస్తుంటారు. కొంతమంది నీళ్ల క్యాన్ లను కొనుక్కొని తాగాల్సి వస్తోంది. ప్రజలు నీటి అవసరాలు తీర్చుకొనేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నీటి సమస్య అధికంగా ఉందని సమాచారం.  తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోని ప్రజలు తాగు నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లా నీళ్లు రాక కొందరు వాటర్ టిన్లు కొనుక్కొని తాగాల్సి వస్తుంది. మరికొన్ని ప్రదేశాల్లో కిలో మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి కనిపిస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు తాగు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తామంటూ సర్కార్ గొప్పలు చెప్పుకుందని, అయితే అవన్ని ఉట్టి మాటలే అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి మంచి నీరు రాక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు.  ఉత్తర తెలంగాణలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు గ్రామాల్లోని ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నల్లా నీళ్లు రాకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!